హైదరాబాదులో మందుబాబులకు తీవ్రమైన శిక్షలు మొదలు!
- ఆరుగురి డ్రైవింగ్ లైసెన్స్ ల శాశ్వత రద్దు
- ఇంత పెద్ద శిక్ష పడటం ఇదే మొదటిసారి
- ఒక రోజు నుంచి 10 రోజుల జైలు శిక్ష
- వారం వ్యవధిలో పట్టుబడిన 655 మందిపై చార్జ్ షీట్
ఇక అధిక మోతాదులో మద్యం తాగి పట్టుబడిన మందుబాబుల్లో ఒకరికి 10 రోజులు, ఇద్దరికి ఆరు రోజులు, 9 మందికి ఐదు రోజులు, పది మందికి 4 రోజులు, 18 మందికి 3 రోజులు, 69 మందికి 2 రోజుల చొప్పున జైలు శిక్ష పడింది. మైనర్ లకు బండ్లు ఇచ్చిన 36 మంది తండ్రులు, యజమానులకు ఒకరోజు జైలు శిక్ష పడింది. సెల్ ఫోన్ మాట్లాడుతూ, చెవుల్లో ఇయర్ ఫోన్లు పెట్టుకుని నడుపుతున్న వారిలో 21 మందికి ఒక రోజు, 12 మందికి రెండు రోజుల శిక్ష పడగా, అందరినీ చంచల్ గూడ జైలుకు తరలించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. వీరికి పాస్ పోర్టు, వీసాలు, ప్రభుత్వ ఉద్యోగాలు రావడంలో ఇబ్బందులు ఏర్పడతాయని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.