ఆశ్చర్యం... నోయిడాలో మరీ ఇంత దారుణంగా తాగుతారా?
- పది నెలల్లో రూ.775 కోట్ల విలువైన మద్యాన్ని ఊదేసిన వైనం
- ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.930 కోట్లకు చేరుకునే అవకాశం
- గతేడాదితో పోలిస్తే 11.3 శాతం పెరిగిన విక్రయాలు
హై ఎండ్ మద్యాన్ని తాగేవారు పెరగడంతోపాటు మద్యం తాగే మహిళల సంఖ్య కూడా పెరగడమే ఇందుకు కారణమని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ ఏడాది జనవరి చివరి వరకు మొత్తం 66.71 లక్షల లీటర్ల మద్యాన్ని నోయిడా వాసులు గొంతులో పోసుకున్నారు. అమ్ముడుపోయిన వాటిలో 46.22 లక్షల బాటిళ్లు (750 ఎంఎల్) ఐఎంఎఫ్ఎల్ మద్యం కాగా, 123 లక్షల బీరు (650 ఎంఎల్) బాటిళ్లు అమ్ముడుపోయినట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. గతేడాదితో పోలిస్తే మద్యం విక్రయాలు 11.3 శాతం పెరిగినట్టు అధికారులు తెలిపారు.