కుమార్తె తొలి సినిమా చూడకుండానే దివికేగిన అతిలోకసుందరి!
- ఈ ఏడాదిలో రిలీజ్ కానున్న జాహ్నవి కపూర్ 'ధడక్' చిత్రం
- సవాళ్లకు తన కుమార్తె రెడీ అని గతంలోనే ప్రకటన
- శ్రీదేవి చివరి చిత్రం 'జీరో' వచ్చే డిసెంబర్లో విడుదల
ఈ సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తన కుమార్తె తొలి సినిమా కోసం అందరిలాగే శ్రీదేవి కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూసింది. కానీ, ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. ఏ రంగంలోనైనా సవాళ్లు ఉంటాయని, సినీ పరిశ్రమ అందుకు అతీతం కాదని, తన కుమార్తె వాటిని ఎదుర్కొనేందుకు రెడీగా ఉందని శ్రీదేవి గతంలోనే మీడియాతో అన్నారు. కానీ, తన కుమార్తె అభినయాన్ని చూడకూండానే ఈ అతిలోకసుందరి అనంతలోకాలకు వెళ్లిపోవడం బాధాకరం. బాలీవుడ్‌లో శ్రీదేవి చివరగా నటించిన 'జీరో' చిత్రం వచ్చే డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.