'ఛలో' దర్శకుడికి కారును గిఫ్ట్ గా ఇవ్వనున్న నాగశౌర్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఛలో' దర్శకుడికి కారును గిఫ్ట్ గా ఇవ్వనున్న నాగశౌర్య

  • హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయిన 'ఛలో'
  • తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లో భారీ వసూళ్లు 
  • ఈ సినిమా టీమ్ కి బహుమతులు ఇవ్వనున్న నాగశౌర్య
కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తోన్న నాగశౌర్య, మంచి కథ దొరకడంతో తానే నిర్మాతగా మారిపోయాడు. దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి 'ఛలో' సినిమా చేశాడు. లవ్ ..యాక్షన్ .. కామెడీకి ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ను వైజాగ్ లో నిర్వహించారు.

త్వరలో సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించే పనిలో వున్నారు. ఈ సినిమా కోసం పనిచేసిన టీమ్ కి .. వాళ్లు పడిన కష్టానికి తగినట్టుగా బహుమతులను ఈ వేదికపై ఇవ్వనున్నారట. ఇప్పటికే గిఫ్ట్ లను ప్యాక్ చేయించడం జరిగిపోయిందని అంటున్నారు. ఇక నాగశౌర్య తన కెరియర్లో తనకి బిగ్గెస్ట్ హిట్ ను ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుములకు కారును గిఫ్ట్ గా ఇవ్వనున్నాడట. ఆల్రెడీ కారును బుక్ చేయడం జరిగిపోయిందనీ .. ఈవెంట్ రోజున దానిని ఇవ్వనున్నాడని చెబుతున్నారు.       
nagashourya
rashmika

More Telugu News