విరాళాలను దుర్వినియోగం చేసిన బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి ఐదేళ్ల జైలు శిక్ష!
- గతంలో రెండు సార్లు బంగ్లాదేశ్‌కి ప్రధానిగా పనిచేసిన బేగం ఖలేదా జియా
- 1,62,00,000 రూపాయలను దుర్వినియోగం చేసిన వైనం
- జియా కుమారుడితో పాటు మరో నలుగురికి 10 సంవత్సరాల జైలు శిక్ష
ఆమె గతంలో రెండు సార్లు బంగ్లాదేశ్‌కి ప్రధానిగా పనిచేశారు. ఆమె చిన్నపిల్లల చారిటబుల్ ట్రస్ట్ కోసం వినియోగించాల్సిన 1,62,00,000 రూపాయలను దుర్వినియోగం చేశారు. కాగా, ఈ కేసులో మరో దోషి జియా కుమారుడు తారిఖ్ రెహమాన్ తో పాటు మరో నలుగురికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది.