'రష్మీ! ప్లీజ్ నా పేరు చెప్పకు' అంటూ ఆటపట్టించిన బ్రహ్మాజీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రష్మీ! ప్లీజ్ నా పేరు చెప్పకు' అంటూ ఆటపట్టించిన బ్రహ్మాజీ!

  • అభిమానులతో ట్విట్టర్ ఛాట్ చేసిన రష్మి గౌతమ్
  • రష్మి, అభిమానుల మధ్యలో దూరిన బ్రహ్మాజీ
  • బ్రహ్మాజీ సమాధానాలను ఆస్వాదించిన నెటిజన్లు
ప్రముఖ నటుడు బ్రహ్మాజీ సరదాగా ఉంటాడని ఆయనతో పరిచయమున్న ప్రతి ఒక్కరూ చెబుతుంటారు. అలాంటి బ్రహ్మాజీ తన కొంటెతనాన్ని సోషల్ మీడియా ద్వారా రష్మి అభిమానులకు రుచి చూపించారు. జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ ట్విట్టర్‌ లో అభిమానులతో ముచ్చటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఒక అభిమాని 'నీకు ఎవరైనా బాయ్‌ ఫ్రెండ్ ఉన్నాడా?' అని ప్రశ్నించాడు. దీనికి రష్మి 'ఉన్నారంటూ' సమాధానమిచ్చింది. ఈ సంభాషణ మధ్యలో ఎంటరైన బ్రహ్మాజీ ‘ప్లీజ్ చెప్పొద్దు.. నా పేరు రివీల్ చెయ్యకు’ అంటూ ఆమెను ఆటపట్టించాడు.

దానికి సమాధానంగా రష్మి ‘మీరు నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ సార్’ అంటూ లవ్ సింబల్‌ చూపించింది. ఆ తరువాత కాసేపటికి మరో అభిమాని రష్మిని ‘సుధీర్ గురించి ఒక్క వర్డ్ చెప్పు’ అని కోరాడు. మరోసారి కాన్వర్సేషన్ లోకి ఎంటరైన బ్రహ్మాజీ ‘సుడిగాలి’ అని సమాధానం చెప్పాడు. దీంతో రష్మి అభిమాని బ్రహ్మాజీని ఉద్దేశిస్తూ ‘బ్రహ్మాజీ గారు, మీకు మ్యారేజ్ అయినా కానీ మీరు అందంగా ఉండటానికి కారణమేంటి?’ అని ప్రశ్నించాడు. ‘మ్యారేజ్ చేసుకోండి.. అందంగా మారతారు' అంటూ కొంటెగా సమాధానం చెప్పాడు. రష్మి ఛాట్ మధ్యలో బ్రహ్మాజీ రావడాన్ని ఆమె అభిమానులు ఆస్వాదించారు. 
ashmi goutam
brahmaji
Twitter
Twitter chat

More Telugu News