ఆ పని చేసుంటే కొడుకు, కోడలు నాకు వద్దేవద్దు: గ్రహణ బలిచ్చిన రాజశేఖర్ తల్లి
- పోలీసులు నా కొడుకును తీవ్రంగా హింసిస్తున్నారు
- చెయ్యని నేరాన్ని చేశానని చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారు
- పోలీసులపై రాజశేఖర్ తల్లి ఆరోపణలు
పోలీసులు తనను కూడా ప్రశ్నించారని, ఈ బలి తామివ్వలేదనే చెప్పామని, తాము చేశామని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పింది. తన కుమారుడికి పిల్లలు లేకపోవడంతో వివిధ ప్రాంతాల్లోని దేవాలయాలకు వెళ్లి వస్తాడని, ఎన్నడూ క్షుద్రపూజలు చేయలేదని అన్నారు. పోలీసులు తన కుమారుడిని బాగా కొడుతున్నారని, చెయ్యని నేరాన్ని చేసినట్టు ఒప్పుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.