లాభాల దిశగా 'ఛలో' ... తొలి వీకెండ్ వసూళ్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లాభాల దిశగా 'ఛలో' ... తొలి వీకెండ్ వసూళ్లు

  • నాగశౌర్య హీరోగా 'ఛలో' 
  • తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు 
  • ఓవర్సీస్ లో అదే జోరు
వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య చేసిన 'ఛలో' .. ఈ నెల 2వ తేదీన భారీస్థాయిలో విడుదలైంది. రష్మిక మందన కథానాయికగా నటించిన ఈ సినిమాకి, తొలిరోజునే అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతూ వెళుతోంది. ఈ సినిమాకైన బడ్జెట్ ..  జరిగిన బిజినెస్ .. థియేటర్ల సంఖ్యను చూసుకుంటే, మంచి ఫలితాలను రాబడుతున్నట్టేనని అంటున్నారు.

 తెలుగు రాష్ట్రాల్లో తొలిమూడు రోజుల్లోనే ఈ సినిమా మూడున్నర కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిందని చెబుతున్నారు. 'ఛలో' సినిమా హీరోగా .. నిర్మాతగా నాగశౌర్యకి సక్సెస్ ను తెచ్చిపెట్టింది. దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే వెంకీ కుడుములకి మంచి మార్కులు పడిపోయాయి. ఇక రష్మిక మందనకి తెలుగులో ఇదే తొలి సినిమా. తొలి సినిమాతోనే హిట్ కొట్టడం రష్మికకు కలిసొస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.       
nagashourya
rashmika

More Telugu News