త్రిష వైదొలగడానికి నేను కారణం కాదు: కీర్తి సురేష్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్రిష వైదొలగడానికి నేను కారణం కాదు: కీర్తి సురేష్

  • త్రిష ఎందుకు వైదొలగిందో నాకు తెలీదు
  • త్రిషతో నాకు కాంబినేషన్ సీన్లు కూడా లేవు
  • అలాంటి విషయాల్లో నేను జోక్యం చేసుకోను
ప్రముఖ సినీ నటి త్రిష 'సామి 2' సినిమా నుంచి వైదొలగేందుకు కారణం తాను కాదని సినీ నటి కీర్తి సురేష్ తెలిపింది. ‘ఇదు ఎన్న మాయం’ సినిమాతో కోలీవుడ్‌ లో అడుగుపెట్టిన కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం ఆమె ‘సండకోళి 2’, ‘సామి 2’, మహంతి’ సినిమాల్లో నటిస్తోంది. ఇంకా విజయ్ సినిమాను కూడా అంగీకరించింది. అయితే ‘సామి 2’ సినిమా నుంచి త్రిష వైదొలగడానికి కీర్తి సురేష్ కారణమని ప్రచారం జరిగింది.

 వాటిపై స్పందించిన కీర్తి సురేష్,  ఆ సినిమాలో త్రిషతో తనకు కాంబినేషన్‌ సీన్లే లేవని తెలిపింది. అలాంటప్పుడు ఆమె సినిమా నుంచి వైదొలగడానికి తానెలా కారణమవుతానని చెప్పింది. త్రిష సినిమా నుంచి తప్పుకున్న కారణం తనకు తెలియదని చెప్పింది. ఇలాంటి విషయాల్లో తానేమాత్రం జోక్యం చేసుకోనని చెప్పింది. అలాగే అజిత్‌ ‘విశ్వాసం’ సినిమాలో తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదని తెలిపింది. 
trisha
keerti suresh
sami-2

More Telugu News