సినీనటుడు మహేశ్ బాబుకి చిన్నారి లేఖ.. జవాబిచ్చిన ప్రిన్స్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినీనటుడు మహేశ్ బాబుకి చిన్నారి లేఖ.. జవాబిచ్చిన ప్రిన్స్!

  • రిప్లై ఇచ్చిన మహేశ్ బాబు
  • ఇంటర్నెట్‌ విరివిగా వాడుతోన్న ఈ కాలంలో లేఖ పంపడం ఆశ్చర్యపరిచింది
  • మా పిల్లలకు కూడా 'శ్రీమంతుడు' సినిమా చాలా ఇష్టం
  • బాగా చదువుకో
సినీన‌టుడు మహేశ్ బాబు అంటే చిన్నారుల‌కు కూడా చాలా ఇష్టం. తాజాగా నేహా అనే ఓ చిన్నారి మ‌హేశ్ బాబుకి ఓ లేఖ రాసి పంపింది. చిన్నారులు కూడా ఇంట‌ర్నెట్‌ను ఉప‌యోగిస్తోన్న ఈ కాలంలో ఆమె రాసిన లేఖ మ‌హేశ్ బాబుకి ఎంత‌గానో న‌చ్చేసింది. దీంతో మ‌హేశ్ బాబు కూడా ఆ చిన్నారికి లేఖ రాయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఈ విష‌యాన్ని త‌న ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతా ద్వారా తెలియ‌జేశాడు.

ఇంటర్నెట్‌, ఈ-మెయిల్స్  విరివిగా వాడుతోన్న ఈ కాలంలో  ఆమె పోస్టు ద్వారా పంపిన లేఖ త‌న‌ను ఆశ్చర్యపరిచిందని మ‌హేశ్ బాబు పేర్కొన్నాడు. త‌న‌ సినిమాల గురించి ఆమె తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆమెలానే త‌న పిల్ల‌లు సితార, గౌతమ్‌లకు ‘శ్రీమంతుడు’ చిత్రమంటే ఇష్టమని చెప్పాడు. నేహా లేఖను చదవడం నిజంగా సంతోషంగా ఉందని, నేహా బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాన‌ని మ‌హేశ్ బాబు ఆ చిన్నారికి సోష‌ల్ మీడియాతో ద్వారా కూడా స‌మాధానం ఇచ్చాడు. ప్ర‌స్తుతం మ‌హేశ్ బాబు చేతిలో ప‌లు సినిమాలు ఉన్నాయి. షూటింగుల్లో పాల్గొంటూ ఆయ‌న బిజీగా ఉంటున్నాడు.      
Mahesh Babu
letter
Instagram

More Telugu News