కంటెంట్ పైనే ప్రత్యేక శ్రద్ధ పెట్టిన మహేశ్ బాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కంటెంట్ పైనే ప్రత్యేక శ్రద్ధ పెట్టిన మహేశ్ బాబు

  • నిరాశపరిచిన 'బ్రహ్మోత్సవం' 
  • డీలాపడేలా చేసిన 'స్పైడర్'
  • కొత్త నిర్ణయం తీసుకున్న మహేశ్ బాబు 
మహేశ్ బాబు ఒకసారి ఒక కథను ఒకే చేస్తే ఆ తరువాత పూర్తి విశ్వాసాన్ని దర్శకుడిపైనే ఉంచుతాడు. తనకి హిట్స్ ఇచ్చిన దర్శకులకి మరో అవకాశాన్ని ఇచ్చే విషయంలోను ఆయన అదే నమ్మకాన్ని ఉంచుతాడు. అయితే అదే ధోరణి తనకి పరాజయాలను తెచ్చిపెడుతుందనే విషయాన్ని గ్రహించిన మహేశ్ బాబు, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సమాచారం.

'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' తో హిట్ ఇచ్చాడని శ్రీకాంత్ అడ్డాలకి మరో ఛాన్స్ ఇస్తే 'బ్రహ్మోత్సవం'తో భారీ ప్లాప్ ఇచ్చాడు. తమిళంలో స్టార్ డైరెక్టర్ అని మురుగదాస్ కి 'స్పైడర్'తో ఛాన్స్ ఇస్తే రెండు భాషల్లో డీలాపడేలా చేశాడు. అందువలన దర్శకులను పూర్తిగా నమ్మేయకుండా, కంటెంట్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మహేశ్ బాబు నిర్ణయించుకున్నాడట. అంతేకాదు .. 'స్పైడర్' ఇచ్చిన అనుభవం వలన ఒకేసారి ద్విభాషా చిత్రం చేయకూడదనే నిర్ణయం కూడా తీసుకున్నాడట. ఇలా కంటెంట్ పై దృష్టి పెట్టడం వల్లనే వంశీ పైడిపల్లి తరువాత మరే దర్శకుడికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అంటున్నారు.    
Mahesh Babu

More Telugu News