కనిపించకుండా పోయిన సీఐ వెంకటేశ్వర్లు ఆచూకీ లభ్యం

  • బాపట్లలోని రిసార్ట్ లో సీఐ
  • పట్టుకున్న నల్గొండ పోలీసులు
  • నిర్ధారించిన ఐజీ స్టీఫెన్ రవీంద్ర
గత 24 గంటలుగా కనిపించకుండా పోయిన నల్గొండ టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఆచూకీ లభ్యమయింది. గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకలో సీఐ ఉన్నట్టు సమాచారం అందడంతో, తెలంగాణ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మారుపేరుతో సీఐ వెంకటేశ్వర్లు ఓ రిసార్ట్స్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అక్కడకు వెళ్లిన నల్గొండ పోలీసులు వెంకటేశ్వర్లును పట్టుకున్నారు. సీఐ ఆచూకీ లభించిన విషయాన్ని ఐజీ స్టీఫెన్ రవీంద్ర కూడా నిర్ధారించారు.

నల్గొండ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసును సీఐ వెంకటేశ్వర్లు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనపై తీవ్ర ఒత్తిడి ఉన్నట్టు సమాచారం. దీంతో, డిపార్ట్ మెంట్ సిమ్ కార్డు, రివాల్వర్ ను అప్పగించి, ఆయన ఎవరికీ కనిపించకుండా పోయారు. తన పర్సనల్ ఫోన్ ను కూడా స్విచ్ఛాప్ చేసుకున్నారు.
Go Back to Shorts
ci venkateswarlu
stephen ravindra
nalgonda ci

More Telugu News