దర్శకుడి పనిలో జోక్యం చేసుకునే అలవాటు లేదు: శ్రుతి హాసన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దర్శకుడి పనిలో జోక్యం చేసుకునే అలవాటు లేదు: శ్రుతి హాసన్

  • కొన్ని పాత్రలు నచ్చకపోయినా చేశాను 
  • అందుకు కొన్ని పరిస్థితులు కారణం 
  • కొన్ని సినిమాలు కొన్ని అనుభవాలు నేర్పాయి
తెలుగు .. తమిళ భాషల్లో అందాల కథానాయికగా శ్రుతి హాసన్ కి ఎంతో క్రేజ్ వుంది. అయితే హిందీ సినిమాలపై దృష్టి పెట్టిన ఆమె, తెలుగు .. తమిళ ప్రేక్షకులకు దూరమైందనే చెప్పాలి. అలాంటి శ్రుతి హాసన్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "నేను చేసిన సినిమాలు కొన్ని పరాజయం పాలైతే .. మరికొన్ని సినిమాలు ఘన విజయాలు సాధించాయి. ఈ రెండు రకాల సినిమాల నుంచి నేను కొన్ని అనుభవాలను నేర్చుకున్నాను"

"కొన్ని పాత్రలను ఇష్టపడి చేస్తే .. మరికొన్ని పాత్రలు నచ్చకపోయినా పరిస్థితుల కారణంగా చేయవలసి వచ్చింది. దర్శకుడు ఒక సీన్ గురించి చెప్పినప్పుడు .. మరోలా చేస్తే బాగుంటుంది కదా అనుకుంటాను గానీ, ఆ విషయాన్ని బయటికి చెప్పను. ఎందుకంటే దర్శకుడి పనిలో జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఒక సినిమా పరాజయం పాలైతే అందుకు దర్శకుడు కారకుడనేది నా అభిప్రాయం. సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ కూడా ఆయనకే ఇస్తాను" అంటూ చెప్పుకొచ్చింది.
sruthi hassan

More Telugu News