చిరూకి డూప్ గా చేయడం ఓ అదృష్టం: ప్రభాస్ శ్రీను
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరూకి డూప్ గా చేయడం ఓ అదృష్టం: ప్రభాస్ శ్రీను

  • ఓరోజున రాజమౌళి గారు ఫోన్ చేశారు 
  • చిరంజీవి గారికి డూప్ గా చేయమన్నారు
  • చిరంజీవి గారిది .. నాది ఒకటే డ్రెస్ 
  • సెట్లో తప్పించుకుని తిరిగాను     
తెలుగు తెరపై కామెడీ విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ శ్రీను, తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ తన కెరియర్ కి సంబంధించిన కొన్ని విషయాలను గురించి ప్రస్తావించారు. " 'మగధీర' సినిమాలో చిరంజీవిగారికి నేను డూప్ గా చేశాను .. అదో అదృష్టమనే చెప్పాలి. ఓ రోజున తెల్లవారు జాము వరకూ ప్రభాస్ ఇంట్లో వాలీబాల్ ఆడేసి వచ్చాను. అప్పుడే రాజమౌళిగారి నుంచి ఫోన్ కాల్ వచ్చింది".

'చిరంజీవిగారికి డూప్ గా కనిపించాలి చేస్తావా?' అని అడిగారు. 'చేస్తావా ఏంటి సార్ .. ఇప్పటికిప్పుడు వచ్చేస్తాను' అన్నాను. 'అయితే అల్యూమినియం ఫ్యాక్టరీకి వచ్చేసేయ్' అని అన్నారు. చిరంజీవి గారు వేసుకునే డ్రెస్ వంటిదే నాకు వేసి .. కొన్ని డూప్ షాట్స్ తీశారు. చిరంజీవి గారిది .. నాది ఒకటే డ్రెస్. సేమ్ డ్రెస్ లో సెట్లో ఆయనకి ఎలా ఎదురుపడేది? అందువలన చిరంజీవిగారికి కనిపించకుండా తప్పించుకుని తిరిగేవాడిని" అని చెప్పుకొచ్చారు.    
prabhas srinu

More Telugu News