జోక్యం చేసుకోకపోవడం వలన నష్టపోయాను: నాగశౌర్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జోక్యం చేసుకోకపోవడం వలన నష్టపోయాను: నాగశౌర్య

  • మొదట్లో కథ విషయంలో జోక్యం చేసుకోలేదు 
  • స్క్రీన్ ప్లే గురించి పట్టించుకోలేదు 
  • ఫలితంగా పరాజయాలు ఎదురయ్యాయి
యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నాగశౌర్య, సొంత బ్యానర్లో వరుస సినిమాలు చేసే ఆలోచనలో వున్నాడు. కథ .. స్క్రీన్ ప్లే విషయంలో తన జోక్యం ఎక్కువైందనే విమర్శకు ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఇంతవరకూ నేను చేసిన సినిమాల్లో కథ విషయంలో ఎంతమాత్రం కల్పించుకునేవాడిని కాదు. స్క్రీన్ ప్లే విషయంలోను దర్శకుడిపైనే పూర్తి నమ్మకం వుంచేవాడిని.

ఫలితంగా పరాజయాలు ఎదురుకావడం మొదలయ్యాయి. ఒక మెట్టు పైకి ఎక్కానని అనుకునే లోగానే, నాలుగు మెట్లు దిగిపోతుండటం నన్ను ఆలోచింపజేసింది. అందువల్లనే కథ .. స్క్రీన్ ప్లే విషయంలో వేలు పెడుతున్నాను .. అవసరమనుకుంటే కాలు పెడతాను కూడా. సినిమా అనేది నా కెరియర్ ను ప్రభావితం చేస్తున్నప్పుడు, దాని విషయంలో నేను ఆ మాత్రం కేర్ తీసుకోవడంలో అర్థం వుంది కదా" అని చెప్పుకొచ్చాడు. 
nagashourya

More Telugu News