ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని క్రిస్ గేల్.. ఎవరెవరు ఎంతకు అమ్ముడుపోయారంటే..!
- ఐపీఎల్-2018 వేలం పాట
- రూ. 7.6 కోట్లకు అమ్ముడుపోయిన అశ్విన్
- బెన్ స్టోక్స్ ధర రూ. 12.5 కోట్లు
శిఖర్ ధావన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 5.2 కోట్లకు కొనుగోలు చేసింది. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ రూ. 7.6 కోట్లతో దక్కించుకుంది. రూ. 2 కోట్ల కనీస ధరలో వేలానికి వచ్చిన అశ్విన్ భారీ మొత్తానికి అమ్ముడుపోవడం విశేషం. కీరన్ పొలార్డ్ ను ముంబై ఇండియన్స్ రూ. 5.4 కోట్లకు సొంత చేసుకుంది. వేలం ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.