నేను .. సుడిగాలి సుధీర్.. గెటప్ శీను .. ఎవరి ప్రత్యేకత వారిదే!: రామ్ ప్రసాద్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను .. సుడిగాలి సుధీర్.. గెటప్ శీను .. ఎవరి ప్రత్యేకత వారిదే!: రామ్ ప్రసాద్

  • మేమంతా మంచి స్నేహితులం 
  • ఎలాంటి విభేదాలు రాలేదు 
  • ఎవరి టాలెంట్ వాళ్లది
" 'జబర్దస్త్' కార్యక్రమంలో మీ టీమ్ లో సుడిగాలి సుధీర్ .. గెటప్ శ్రీను ఉన్నారు కదా .. వాళ్లతో మీ రిలేషన్ ఎలా వుంటుంది?" అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో రామ్ ప్రసాద్ కి ఎదురైంది. అప్పుడాయన స్పందిస్తూ .. "మా ముగ్గురి మధ్య మంచి అనుబంధం ఉండటం వల్లనే 5 సంవత్సరాలుగా కలిసి ప్రయాణం చేస్తున్నాం.

మా ముగ్గురిని విడిపోయి మూడు టీమ్స్ పెట్టుకోమన్నా .. కలిసి ఉంటేనే టీమ్ స్ట్రాంగ్ గా ఉంటుందని భావించి అలాగే వున్నాం. మా మధ్య ఎప్పుడూ ఎలాంటి అభిప్రాయ భేదాలు రాలేదు. ఒకరికి మించిన పేరు మరొకరికి వచ్చేస్తోందనే జెలసీ ఎప్పుడూ లేదు. మా టీమ్ లో సుధీర్ కి మంచి క్రేజ్ వుంది. స్క్రిప్ట్ రాసే విషయంలో నాకు మంచి పట్టుంది .. అలాగే గెటప్స్ వేయడంలో శీనుకంటూ ప్రత్యేకత వుంది. ఎవరి టాలెంట్ .. ప్రత్యేకత వాళ్లకి వున్నాయి" అని చెప్పుకొచ్చాడు. 
ram prasad

More Telugu News