సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • ప్రేమలో పడి తప్పుచేశానంటున్న ముద్దుగుమ్మ 
  • 'బాహుబలి 2'కి మరో గొప్ప గౌరవం 
  • మరో మల్టీ స్టారర్ లో నాగార్జున 
  • క్లైమాక్స్ కి వచ్చిన మహేశ్ సినిమా
*  కెరీర్ ప్రారంభంలో ఓ వ్యక్తితో ప్రేమలో పడి పెద్ద తప్పు చేశానని, దాంతో తన కెరీర్ ఎఫెక్ట్ అయిందని చెప్పింది కథానాయిక రెజీనా. "తెలిసో తెలియకో ఆ తప్పు చేశాను. మళ్లీ అలాంటి తప్పు చేయను.. ఇక ప్రేమగీమ వంటివి వుండవు.. కెరీర్ మీదే దృష్టి పెడుతున్నాను" అని చెప్పింది.      
*  ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన 'బాబుబలి 2' చిత్రానికి మరో గౌరవం దక్కింది. అహ్మదాబాద్ 'ఐఐఎం' (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్)లో ఈ చిత్రాన్ని కేస్ స్టడీ (అధ్యయన అంశం)గా ప్రవేశపెడుతున్నారట.  
*  ఇటీవల నానితో కలసి మల్టీ స్టారర్ చిత్రం చేయడానికి అంగీకరించిన అక్కినేని నాగార్జున తాజాగా తమిళ కథానాయకుడు ధనుష్ తో కలసి మరో మల్టీ స్టారర్ చేయడానికి అంగీకరించారు. ధనుష్ ఇటీవల నాగార్జునకు కథ వినిపించగా, వెంటనే ఆయన ఓకే చెప్పేశారట. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.
*  మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న 'భరత్ అనే నేను' చిత్రం షూటింగ్ క్లైమాక్స్ కి చేరుకుంది. ఈ చిత్రం పతాక సన్నివేశాలను ఈ నెల 18 నుంచి హైదరాబాదులో చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.    
Regina
bahubali
Nagarjuna
Mahesh Babu

More Telugu News