ఈనెల 26 వరకు ఎదురులేని ‘అజ్ఞాతవాసి’, ‘జై సింహా’
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈనెల 26 వరకు ఎదురులేని ‘అజ్ఞాతవాసి’, ‘జై సింహా’

  • మరో పది రోజులపాటు విడుదలకు లేని సినిమాలు
  • అప్పటి వరకు ఈ రెండింటిదే హవా
  • ‘అజ్ఞాతవాసి’ నష్టాలు పూడ్చుకునే అవకాశం
భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీసు వద్ద బోల్తాపడిన పవన్ కల్యాణ్ సినిమా ‘అజ్ఞాతవాసి’, హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ‘జై సింహా’లకు ఒక రకంగా ఇది గుడ్ న్యూసే. ఈ నెల 26 వరకు ఈ రెండింటికి ఎదురులేనట్టే. అప్పటి వరకు మరో సినిమా ఏదీ విడుదలకు లేకపోవడంతో ఈ రెండింటి హవా  కొనసాగే అవకాశం ఉంది. తమిళ హీరో సూర్య ‘గ్యాంగ్’, రాజ్‌తరుణ్ ‘రంగులరాట్నం’ సినిమాలు విడుదలైనప్పటికీ వాటినెవరూ పట్టించుకోవడం లేదు. దీంతో పవన్, బాలయ్య సినిమాలకు ఢోకా లేనట్టే. ఈ రకంగా చూస్తే ‘అజ్ఞాతవాసి’కి ఇది గుడ్ న్యూసే.  నష్టాల నుంచి కొంతవరకైనా తేరుకునే అవకాశం ఉంటుందని టాలీవుడ్ టాక్.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్-పవన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ అభిమానుల అంచనాలను తలకిందులు చేసి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. మరోవైపు సంక్రాంతి సెంటిమెంట్‌తో వచ్చిన బాలకృష్ణ సినిమా ‘జై సింహా’ హిట్ టాక్‌తో బి, సి సెంటర్లలో భారీ విజయం నమోదు చేసింది. ఇప్పుడు బరిలో మరో పెద్ద సినిమా లేకపోవడంతో మరో పది రోజులు ఈ రెండు సినిమాల హవా కొనసాగే అవకాశం ఉంది.
Agnathavasi
Jai Simha
Tollywood

More Telugu News