22న కోర్టుకు వస్తున్నా: పోలీసులకు యాంకర్ ప్రదీప్ సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

22న కోర్టుకు వస్తున్నా: పోలీసులకు యాంకర్ ప్రదీప్ సమాచారం

  • డిసెంబర్ 31 రాత్రి దొరికిపోయిన ప్రదీప్
  • మందు కొట్టి వాహనం నడిపిన యాంకర్
  • ఇప్పటికే కౌన్సెలింగ్ పూర్తి
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి పోలీసులు జరిపిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 178 బీఏసీ (బ్లడ్ ఆల్కహాల్ కౌంట్)తో అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ బుల్లితెర యాంకర్, నటుడు ప్రదీప్, 22వ తేదీ సోమవారం నాడు కోర్టుకు హాజరవుతానని పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

గత వారంలో గోషామహల్ లోని ట్రాఫిక్ పోలీసుల కౌన్సెలింగ్ కేంద్రానికి హాజరైన ఆయన, ఆ మరుసటి రోజే కోర్టుకు హాజరు కావాల్సి వుండగా, షూటింగులు ఉన్నాయంటూ డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. ఆపై 16వ తేదీన కోర్టుకు వస్తానని ప్రదీప్ చెప్పాడు. 16న కనుమ పండగ కారణంగా కోర్టుకు సెలవు కావడంతో అదే విషయాన్ని పోలీసులు ప్రదీప్ కు తెలిపారు. దీంతో 22న నాంపల్లి లోని కోర్టుకు వస్తానని ప్రదీప్ తెలిపినట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
Anchor Pradeep
Drunken Drive
Hyderabad
Police

More Telugu News