విమానం నుంచి ప్రయాణికులను లాగిపడేస్తాం అని బెదిరించి.. మరోసారి వార్తల్లోకెక్కిన ఇండిగో
- తొలుత విమానం బోర్డింగ్‌కు అంగీకరించారు
- తరువాత దిగాలని బెదిరించారు- ప్రయాణికుడు
- మేము మర్యాదగానే చెప్పాం-ఇండిగో
- పాట్నా విమానాశ్రయంలో ఘటన
విమానం దిగకపోతే భద్రతా సిబ్బందిని పిలిపించి ప్రయాణికులను బలవంతంగా బయటకు లాగిపడేస్తామని సిబ్బంది బెదిరించారని మహారాష్ట్రకు చెందిన ప్రసాద్ నందూర్‌కర్ అనే వ్యక్తి తెలిపారు. బీహార్‌లోని పాట్నా విమానాశ్రయంలో ఈ ఘటన జరిగిందని అన్నారు. ఈ క్రమంలో తమపై వస్తోన్న ఆరోపణల పట్ల ఇండిగో స్పందిస్తూ... విమానంలో 20 మంది ప్రయాణికులు మినహా అందరూ దిగారని, దిగని వారిని తామేం బెదిరించలేదని, తాము చాలా మర్యాదగానే చెప్పామని అంటోంది.