మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీ పాత్రలో నటించ‌బోతున్న విద్యాబాల‌న్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీ పాత్రలో నటించ‌బోతున్న విద్యాబాల‌న్‌

  • సాగ‌రికా ఘోష్ న‌వ‌లకు దృశ్య‌రూపం
  • వెబ్ సిరీస్ లేదా సినిమా రూపంలో తెర‌కెక్కే అవ‌కాశం
  • వెబ్ సిరీస్ అయితే బాగుంటుంద‌న్న సాగ‌రిక
భార‌త మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీ పాత్రలో విల‌క్ష‌ణ న‌టి విద్యాబాలన్ న‌టించ‌బోతోంది. 'ఇందిర: ఇండియాస్ ప‌వ‌ర్‌ఫుల్ ప్రైమ్ మినిస్ట‌ర్‌' పేరుతో ప్ర‌ముఖ ర‌చ‌యిత సాగ‌రికా ఘోష్ రాసిన న‌వ‌లను వెబ్‌సిరీస్‌గా గానీ, సినిమాగా గానీ తెర‌కెక్కించ‌నున్నారు. అయితే ఏ రూపంలో రాబోతుంద‌నే విష‌యం మీద ఇంకా స్ప‌ష్ట‌త లేదు. త‌న పుస్త‌కం హ‌క్కుల‌ను రాయ్ క‌పూర్ ప్రొడ‌క్ష‌న్స్ కొనుగోలు చేసిన‌ట్లు సాగ‌రికా ఘోష్ సోష‌ల్ మీడియాలో తెలిపారు.

అలాగే విద్యాబాలన్ కూడా తాను ఇందిర పాత్ర‌లో న‌టించ‌బోతుండ‌టం చాలా సంతోషంగా ఉంద‌ని ప్ర‌క‌టించింది. ఈ పుస్త‌కంలో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి కాలంలో ఇందిర ప్ర‌వ‌ర్తించిన తీరు, ఆమె పాల‌న‌, వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను సాగ‌రిక వివ‌రించారు. అందుక‌ని ఈ చిత్రాన్ని వెబ్‌సిరీస్ రూపంలోనే తెర‌కెక్కిస్తే బాగుంటుంద‌ని ఆమె ఆకాంక్షిస్తున్నారు.
indira gandhi
vidya balan
web series
sagairka ghosh

More Telugu News