మ‌ద్యం తాగి కారు న‌డిపిన కేసులో.. ఎట్టకేలకు కౌన్సెలింగ్‌కు హాజ‌రైన యాంక‌ర్ ప్ర‌దీప్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మ‌ద్యం తాగి కారు న‌డిపిన కేసులో.. ఎట్టకేలకు కౌన్సెలింగ్‌కు హాజ‌రైన యాంక‌ర్ ప్ర‌దీప్!

  • డ్రంకెన్ డ్రైవ్ లో ఇటీవలే దొరికిపోయిన ప్రదీప్
  • పోలీసులకు కనపడకుండా ఉంటోన్న వైనం
  • హైద‌రాబాద్‌లోని గోషామహల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో కౌన్సెలింగ్
నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా పీక‌ల‌దాకా తాగి కారు డ్రైవింగ్ చేస్తూ పోలీసుల‌కు దొరికిపోయిన యాంకర్ ప్ర‌దీప్ ఎట్ట‌కేల‌కు కౌన్సెలింగ్‌కు హాజ‌ర‌య్యాడు. కొన్ని రోజులుగా ప్ర‌దీప్ క‌నపడ‌కుండా పోయిన విష‌యం తెలిసిందే. మ‌రోసారి అలా చేయ‌బోన‌ని ఓ వీడియో కూడా విడుద‌ల చేశాడు. ఆయ‌న రెండు రోజుల్లోగా కౌన్సెలింగ్‌కు రాక‌పోతే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు ఇటీవ‌ల హెచ్చ‌రిక కూడా చేశారు. ఈ క్రమంలో ఈ రోజు ప్ర‌దీప్‌ హైద‌రాబాద్‌లోని గోషామహల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి కూర్చున్నాడు. పెళ్లికాని వారు త‌ల్లిదండ్రుల‌తో, పెళ్ల‌యినా వారు భార్య‌తో క‌లిసి కౌన్సెలింగ్‌కు రావాల‌ని చెప్పిన నేప‌థ్యంలో.. ప్ర‌దీప్ త‌న తండ్రితో కలసి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.
pradeep
drunken drive
Hyderabad
Police

More Telugu News