థ్యాంక్యూ వెరీ మచ్ నితీశ్ కుమార్: తేజస్వీ యాదవ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

థ్యాంక్యూ వెరీ మచ్ నితీశ్ కుమార్: తేజస్వీ యాదవ్

  • రాజకీయ కారణాలతోనే జైలుకు పంపారు
  • బీజేపీతో కలిసుంటే రాజా హరిశ్చంద్ర బిరుదు ఇచ్చేవారు
  • బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్
తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను రాజకీయ కారణాలతోనే జైలుకు పంపించారని ఆరోపిస్తూ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇందుకు కారణమంటూ ఆరోపించారు తేజస్వీ యాదవ్. దాణా కుంభకోణంలో లాలూ దోషిగా నిరూపితుడైన తరువాత, నిన్న ఆయనకు సీబీఐ కోర్టు మూడున్నరేళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించిన మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, "థ్యాంక్యూ వెరీ మచ్ నితీశ్ కుమార్" అని వ్యాఖ్యానించారు. గత సంవత్సరం మహా కూటమి నుంచి వైదొలగి, బీజేపీకి చేరువై తన పదవిని నితీశ్ కుమార్ కాపాడుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జేడీ-యూ, ఆర్జేడీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంది.

"బీజేపీతో చేతులు కలిపేందుకు నా తండ్రి సిద్ధమయ్యుంటే, ఆయనకు రాజా హరిశ్చంద్ర అన్న బిరుదును ఆ పార్టీ ఇచ్చి ఉండేది" అని కూడా తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు.
Bihar
Lalu Prasad Yadav
Tejaswi yadav

More Telugu News