ట్రాఫిక్ పోలీసుల కాంటాక్టులోకి వచ్చిన యాంకర్ ప్రదీప్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ట్రాఫిక్ పోలీసుల కాంటాక్టులోకి వచ్చిన యాంకర్ ప్రదీప్!

  • వారం క్రితం డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోయిన మాచిరాజు ప్రదీప్
  • అప్పటి నుంచి పరారీలో ఉన్న యాంకర్
  • సోమవారం నాడు కౌన్సెలింగ్ కు వస్తానని వెల్లడి
వారం రోజుల క్రితం పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడి, పోలీసుల కౌన్సెలింగ్ కు రాకుండా తప్పించుకు తిరుగుతున్న ప్రముఖ యాంకర్ ప్రదీప్, తాను సోమవారం నాడు బేగంపేట ట్రాఫిక్ పీఎస్ లో కౌన్సెలింగ్ కు వస్తున్నట్టు చెప్పాడు. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ చౌహాన్ కు ప్రదీప్ సమాచారాన్ని ఇచ్చినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

కొత్త సంవత్సరం సందర్భంగా పూటుగా మందు కొట్టి పోలీసుల తనిఖీల్లో ప్రదీప్ దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఆపై కౌన్సెలింగ్ కు రాకపోవడంతో ఆయన కార్యాలయం, ఇంటికి వెళ్లిన పోలీసులు ఉత్త చేతులతో వచ్చారు. ఆపై ప్రదీప్ పరారీలో ఉన్నట్టు ఉన్నతాధికారులకు నివేదికను ఇచ్చారు. కాగా, ట్రాఫిక్ నిబంధనల ప్రకారం, కౌన్సెలింగ్ కు భార్య లేదా తల్లితో పాటు హాజరు కావాల్సి వుంటుంది. ప్రదీప్ కు భార్య లేదు కాబట్టి, తల్లిని తీసుకు రావాలని పోలీసులు చెబుతున్నారు.
Drunden Drive
Pradeep
Hyderabad
Police

More Telugu News