బీజేపీతో చేయి కలిపితే మా నాన్న రాజా హరిశ్చంద్రగా మారిపోతారు: తేజశ్వి యాదవ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీతో చేయి కలిపితే మా నాన్న రాజా హరిశ్చంద్రగా మారిపోతారు: తేజశ్వి యాదవ్

  • నితీష్ కుమార్ కు లాలూ భయం పట్టుకుంది
  • ఆయనకు వ్యతిరేకంగా చెత్త రాజకీయాలు
  • లాలూ నోరు నొక్కేసే యత్నాలు
బీజేపీతో లాలూజీ రాజీపడి ఉంటే ఆయన్ను రాజా హరిశ్చంద్ర మాదిరిగా సత్యవంతుడిగా ఆ పార్టీ కీర్తించేదంటూ ఆయన కుమారుడు తేజశ్వియాదవ్ వ్యాఖ్యానించారు. తన తండ్రి లాలూప్రసాద్ యాదవ్ కు దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష ఖరారైన తర్వాత తేజశ్వి యాదవ్ మీడియాతో మాట్లాడారు. లాలూ అంటే బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు అభద్రతా భావం పట్టుకుందని, దాంతో బీజేపీతో చేయి కలిపి లాలూకు వ్యతిరేకంగా చెత్త రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. లాలూ నోరు నొక్కేయడానికి బీజేపీ చేయాల్సినదంతా చేస్తోందన్నారు.
lalu
tejaswi yadav

More Telugu News