ఒంగోలులో బాలుడిని కిడ్నాప్ చేసి రూ. 70 లక్షలు అడిగిన దుండగులు... ఆరు గంటల్లోనే పట్టేసిన పోలీసులు!

  • రాత్రి 10 గంటల సమయంలో కిడ్నాప్
  • రూ. 70 లక్షలు ఇస్తేనే వదిలేస్తామని బెదిరింపు
  • తెల్లవారుజామున 4 గంటలకు అరెస్ట్
ఒంగోలులో నిన్న రాత్రి పదకొండేళ్ల బాలుడు ప్రణవ్ కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. రాత్రి 10 గంటలకు నగర పరిధిలోని లాయర్ పేటలో బాలుడిని కిడ్నాప్ చేసి, ఆపై తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ. 70 లక్షలు ఇస్తేనే వదిలిపెడతామని కిడ్నాపర్లు బెదిరించగా, విషయం పోలీసులకు చేరింది.

దీంతో దుండగుల సెల్ ఫోన్ నంబరును ట్రాకింగ్ లో పెట్టి రాత్రంతా గాలించారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో గుంటూరు సమీపంలో కిడ్నాపర్ల జాడను తెలుసుకున్నారు. బాలుడిని అపహరించిన వారిలో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరికొందరి కోసం గాలిస్తున్నామని చెప్పారు. బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్టు తెలిపారు.
Go Back to Shorts
Ongole
Police
Kidnap

More Telugu News