నేను తప్పు చేశా.. నాలా ఇంకెవరూ చేయొద్దు!: వైరల్ అవుతున్న ప్రదీప్ వీడియో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను తప్పు చేశా.. నాలా ఇంకెవరూ చేయొద్దు!: వైరల్ అవుతున్న ప్రదీప్ వీడియో!

  • దురదృష్టవశాత్తు దొరికిపోయానన్న ప్రదీప్
  • చట్టప్రకారం ప్రొసీడింగ్స్ ఫాలో అవుతానన్న యాంకర్ 
  • షూటింగ్‌లతో బిజీగా ఉండడం వల్లే రాలేకపోయానని వివరణ
డిసెంబరు 31న రాత్రి డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిపోయిన స్టార్ యాంకర్ ప్రదీప్ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ పోస్టు చేసిన వీడియో ఒకటి ఇప్పుడు  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను తప్పు చేశానని, తనలా ఇంకెవరూ చేయవద్దంటూ ప్రదీప్ అందులో కోరాడు. పోలీసుల కౌన్సెలింగ్‌కు తాను ఎందుకు హాజరుకాలేకపోయిందీ అందులో పేర్కొన్నాడు.

‘‘అందరికీ నమస్కారం’’ అంటూ ప్రారంభమైన ఆ వీడియోలో ‘‘నేను మీ ప్రదీప్ మాచిరాజు. డిసెంబరు 31న జరిగిన సంఘటన గురించి అందరికీ తెలుసు. పోలీసుల కౌన్సెలింగ్‌కు కానీ, దాని తర్వాత జరిగే ప్రొసీడింగ్స్‌కు కానీ హాజరయ్యేందుకు నేను సిద్ధంగా ఉన్నా. అయితే ముందుగా ఒప్పందం చేసుకున్న ప్రోగ్రామ్స్, ఇతర ఈవెంట్ల వల్ల కొంత బిజీగా ఉన్నా. షూటింగ్స్‌తో బిజీగా ఉండడం వల్లే రాలేకపోయాను తప్పితే మరో కారణం ఏమీ లేదు.

ఫోన్ ఆగకుండా మోగుతుండడం వల్ల కొన్ని ముఖ్యమైన ఫోన్లను రిసీవ్ చేసుకోలేకపోయి ఉండొచ్చు. అందరికీ చెప్పేది ఏంటంటే.. చట్టప్రకారం ప్రొసీడింగ్స్‌ను ఫాలో అవుతాను. గతేడాది డ్రంకెన్ డ్రైవ్ గురించి చెప్పిన నేను దురదృష్టవశాత్తు అందులోనే దొరికిపోయాను. నేను చేసిన తప్పును ఇంకెవరూ చేయకూడదని కోరుకుంటున్నా. అందరూ నన్ను అర్థం చేసుకుంటారని భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు.  

డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిపోయిన ప్రదీప్ బుధవారం పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉండగా రాలేదు. దీంతో అతడు పరారీలో ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు. ఈ లోగా ఈ వీడియో‌ను పోస్టు చేసిన ప్రదీప్ తాను పరారీలో లేనని, త్వరలోనే పోలీసుల ఎదుట హాజరు అవుతానంటూ అందులో పేర్కొనడం గమనార్హం. కాగా, తాగి డ్రైవ్ చేయడంతోపాటు అతడి వాహనం అద్దాలకు నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో ఆర్టీఐ చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది
Pradeep
Anchor
Police
counselling
video

More Telugu News