విహార‌యాత్ర‌లో మ‌హేశ్ బాబు కుటుంబం... ఫొటోలు షేర్ చేసిన న‌మ్ర‌త
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విహార‌యాత్ర‌లో మ‌హేశ్ బాబు కుటుంబం... ఫొటోలు షేర్ చేసిన న‌మ్ర‌త

  • ఒమ‌న్‌లో పారాగ్లైడింగ్ చేసిన మ‌హేశ్‌, గౌత‌మ్‌
  • స్నేహితుల‌తో క‌లిసి హాలిడే ట్రిప్‌
  • చాలా ఉత్సాహంగా క‌నిపిస్తున్న మ‌హేశ్‌
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు కుటుంబం స్నేహితుల‌తో క‌లిసి హాలిడే ట్రిప్ వెళ్లింది. ఆ విహార‌యాత్ర‌కు సంబంధించిన ఫొటోల‌ను ఆయ‌న భార్య న‌మ్ర‌త త‌న ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేరు చేశారు. ఒమన్‌లో మ‌హేశ్‌, కుమారుడు గౌతమ్‌లు పారాగ్లైడింగ్ చేసిన ఫొటో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఆమె ఖాతాలోని మిగ‌తా ఫొటోల‌ను ప‌రిశీలిస్తే... వారి కుటుంబం హాలిడేను ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

ముఖ్యంగా చిన్నారి సితార త‌న స్నేహితుల‌తో క‌లిసి స్విమ్మింగ్ పూల్‌లో ఆడుకుంటుండ‌టం, వారంతా డిన్న‌ర్ చేస్తుండ‌టం, హోట‌ల్ గ‌దుల్లో సేద‌తీరుతుండ‌టం, వారు ఆడిన ఆట‌లను... ఈ ఫొటోల్లో చూడొచ్చు. ప్ర‌స్తుతం మహేశ్‌ ‘భరత్‌ అనే నేను’ సినిమాలో నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 27న ఈ సినిమా విడుద‌లకానుంది.


   
holiday
namrata shirodkar
Mahesh Babu
gautam
sitara

More Telugu News