తాగొద్ద‌ని నీతి వాక్యాలు చెప్పాడు.. తనే తాగేసి దొరికిపోయాడు... తెర‌పైకి ప్ర‌దీప్ పాత‌ వీడియో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తాగొద్ద‌ని నీతి వాక్యాలు చెప్పాడు.. తనే తాగేసి దొరికిపోయాడు... తెర‌పైకి ప్ర‌దీప్ పాత‌ వీడియో!

  • మ‌ద్యం తాగి డ్రైవ్ చేయొద్ద‌ని గ‌తంలో చెప్పిన ప్ర‌దీప్‌
  • వీడియో ప్లే చేస్తూ మోత మోగిస్తున్న వార్తా ఛాన‌ళ్లు
  • ఇవాళ బేగంపేట‌లో కౌన్సిలింగ్‌
కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా మ‌ద్యం తాగి, బ్రీత్ అన‌లైజ‌ర్ టెస్టులో దొరికిపోయిన ప్రదీప్‌కు సంబంధించి ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ వీడియోలో మ‌ద్యం తాగి డ్రైవ్ చేయొద్ద‌ని ప్ర‌దీప్ నీతి వాక్యాలు చెబుతుండ‌టం విశేషం. ఇలా నీతి వాక్యాలు చెప్పిన వాడే.. ఇవాళ త‌ప్పతాగి దొరికిపోయాడంటూ వార్తా ఛాన‌ళ్లు ప్ర‌దీప్‌ను తూర్పారపడుతున్నాయి.

ఈ నీతిబోధ‌న‌ల వీడియోను, ప్ర‌దీప్ ప‌ట్టుబ‌డిన వీడియోను ప‌క్క‌ప‌క్క‌నే ప్లే చేస్తూ మోత మోగిస్తున్నాయి. ఒక్క పిచ్చి ప‌నితో ప్ర‌దీప్ ప‌రువు పోగొట్టుకున్నాడ‌ని వ్యాఖ్యానిస్తున్నాయి.  కాగా, ప్ర‌దీప్‌కి క‌చ్చితంగా రెండు నుంచి వారం రోజుల వ‌ర‌కు శిక్ష ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది
pradeep
anchor
drunk n drive

More Telugu News