బాలీవుడ్ మూవీకి ఇంతకుముందే ప్రభాస్ సైన్ చేశాడట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలీవుడ్ మూవీకి ఇంతకుముందే ప్రభాస్ సైన్ చేశాడట!

  • 'సాహో' సినిమా పనుల్లో ప్రభాస్ 
  • తరువాత సినిమా హిందీలో 
  • మూడేళ్ల క్రితమే సైన్ చేసిన ప్రభాస్    
'బాహుబలి' సినిమా సంచలన విజయాన్ని సాధించిన తరువాత ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. దాంతో తెలుగుతో పాటు ఇతర భాషలకి చెందిన దర్శక నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ బాలీవుడ్ సినిమా చేసే ఛాన్స్ ఉందంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలోనే బాలీవుడ్ సినిమాను అంగీకరించే అవకాశం ఉందంటూ చెప్పుకున్నారు.

 అయితే ప్రభాస్ మూడు సంవత్సరాల క్రితమే ఒక హిందీ సినిమాను అంగీకరించాడట. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పాడు. ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' సినిమా పనుల్లో బిజీగా వున్నాడు. ఈ సినిమాలో చాలామంది బాలీవుడ్ నటీనటులతో కలిసి ఆయన నటించనున్నాడు. హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత ప్రభాస్ బాలీవుడ్ మూవీ చేయనున్నాడని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.    
prabhas

More Telugu News