టీఎస్ 07 ఈయూ 6666... డ్రైవింగ్ సీట్లో యాంకర్ ప్రదీప్... రాత్రి జరిగిందిదే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీఎస్ 07 ఈయూ 6666... డ్రైవింగ్ సీట్లో యాంకర్ ప్రదీప్... రాత్రి జరిగిందిదే!

  • పూటుగా తాగి రోడ్డెక్కిన మందుబాబుల తాట తీసిన పోలీసులు
  • జూబ్లీహిల్స్ లో దొరికిపోయిన 100 మంది
  • తనను వదిలేయాలని అడిగిన యాంకర్ ప్రదీప్
  • తమ పని చేసుకుపోయిన పోలీసులు
కొత్త సంవత్సరం వచ్చిందన్న ఆనందంలో పూటుగా తాగి రోడ్డెక్కిన వాళ్ల తాట తీశారు పోలీసులు. గత రాత్రి, హైదరాబాద్ లోని 50కి పైగా ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించగా, దాదాపు 1200 మందికి పైగా పట్టుబడ్డారు. ప్రతి వారాంతంలోనూ డ్రంకెన్ డ్రైవ్ తప్పనిసరిగా జరిగే జూబ్సీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో సుమారు 100 మందికి పైగా మందుబాబులు అడ్డంగా దొరికిపోయారు. జూబ్లీహిల్స్ లోని రోడ్ నంబర్ 45లో జరిగిన తనిఖీల్లో ప్రముఖ యాంకర్, నటుడు ప్రదీప్ దొరికిపోయాడు. ఓ పబ్బులో మందు కొట్టి వచ్చిన ఆయన, మందు తాగితే డ్రైవర్లను చూసుకోవాలని ముందే హెచ్చరించిన పోలీసుల మాటలను బేఖాతరు చేస్తూ, కారెక్కాడు.

స్కోడా కంపెనీకి చెందిన 'టీఎస్ 07 ఈయూ 6666' కారులో డ్రైవింగ్ చేస్తూ బయలుదేరాడు. జూబ్లీహిల్స్ లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఈ కారు కనిపించింది. అనుమానాస్పదంగా ఉన్న వారికి మాత్రమే బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహిస్తున్న పోలీసులకు ప్రదీప్ ముఖం చూడగానే విషయం అర్థమైపోయింది. ఏం పేరు అని పోలీసులు ప్రశ్నించగా, 'ప్రదీప్' అన్న సమాధానాన్ని ఆయనిచ్చాడు. ఈలోగానే అక్కడున్న మీడియా కెమెరాలు ఆయన వైపు వచ్చేశాయి. తనను వదిలేయాలని ప్రదీప్ అడిగినా, పోలీసులు అంగీకరించలేదు. కారును పక్కన పెట్టాలని చెప్పి, ఆయన నోట్లో బ్రీత్ అనలైజర్ ను ఉంచగా, 178 పాయింట్ల రీడింగ్ వచ్చింది. తాను అడ్డంగా దొరికిపోయానని అప్పటికే అర్థం చేసుకున్న ప్రదీప్, కారును పోలీసులకు అప్పగించి, మరో వాహనంలో వెళ్లిపోయాడు. అతన్ని మంగళవారం నాడు కోర్టు ముందు హాజరు పరచనున్నట్టు పోలీసులు వెల్లడించారు.
Anchor Pradeep
Jubilee Hills
Hyderabad
Drunken Drive

More Telugu News