ఆర్మీ ఆఫీసర్ గా శర్వానంద్ .. హైలైట్ గా నిలవనున్న యాక్షన్ సీన్స్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆర్మీ ఆఫీసర్ గా శర్వానంద్ .. హైలైట్ గా నిలవనున్న యాక్షన్ సీన్స్

  • హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ 
  • కథానాయికగా సాయిపల్లవి 
  • నేపాల్ లో మేజర్ షెడ్యూల్  
ఒక వైపున 'నా పేరు సూర్య' సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా చేస్తుంటే, మరో వైపున శర్వానంద్ కూడా అదే విధమైన పాత్రలో కనిపించనున్నాడు. అల్లు అర్జున్ మాదిరిగానే మరింత ఫిట్ నెస్ ను సాధించడానికి గట్టిగానే కసరత్తు చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో 'మహానుభావుడు' చేసి హిట్ కొట్టిన శర్వానంద్, తన తదుపరి సినిమాను హను రాఘవపూడితో చేయనున్నాడు.

ఈ సినిమాలోనే శర్వానంద్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ తరహా ఫైట్స్ చేయనుండటం కూడా శర్వానంద్ కి ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. ఈ సినిమాలో శర్వా జోడీగా సాయిపల్లవి నటించనుంది. ఈ ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఒక రేంజ్ లో వుంటాయని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందనీ .. నేపాల్ లో ఒక షెడ్యూల్ ను ప్లాన్ చేశామని చెబుతున్నారు.   
sharvanand
sai pallavi

More Telugu News