వరుస హిట్స్ ఉన్నప్పటికీ నాని చాలా సింపుల్ గా ఉంటాడు: భూమిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వరుస హిట్స్ ఉన్నప్పటికీ నాని చాలా సింపుల్ గా ఉంటాడు: భూమిక

  • నానికి వదినగా చేసిన పాత్ర సంతృప్తినిచ్చింది
  • సాయిపల్లవి కూడా మంచి నటి 
  • ఆమెకు జీవితంపై మంచి అవగాహన వుంది
నిన్నటి తరం కథానాయికలలో భూమిక తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె తన వయసుకు తగిన ముఖ్యమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు. అలా తాజాగా ఆమె 'మిడిల్ క్లాస్ అబ్బాయ్'లో నాని వదిన పాత్రలో నటించారు. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ పట్ల భూమిక ఆనందాన్ని వ్యక్తం చేశారు. చాలా గ్యాప్ తరువాత తెలుగులో తాను చేసిన ఈ పాత్ర, తనకి చాలా సంతృప్తిని ఇచ్చిందని అన్నారు.

నానితో నటించడం చాలా హ్యాపీగా అనిపించిందనీ, వరుస హిట్స్ ఉన్నప్పటికీ ఆయన చాలా సింపుల్ గా ఉంటాడని చెప్పారు. ఇక సాయిపల్లవితో కలిసి నటించడం కూడా మంచి అనుభూతిని ఇచ్చిందని అన్నారు. సాయిపల్లవికి జీవితంపై మంచి అవగాహన వుందనీ, ఆమె అన్నీ నేర్చేసుకుని సినిమాల్లోకి రావడమే అందుకు నిదర్శనమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను 'సవ్యసాచి'లో ఓ ముఖ్యమైన పాత్రను చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు.    
nani
sai pallavi

More Telugu News