నేను విసిరేసిన ఎమ్మెల్సీ పోస్టును టీడీపీ నేత‌లు పోటీప‌డి ఏరుకుంటున్నారు: శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను విసిరేసిన ఎమ్మెల్సీ పోస్టును టీడీపీ నేత‌లు పోటీప‌డి ఏరుకుంటున్నారు: శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి

  • జనవరి 21న క‌ర్నూలు స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక
  • నైతిక విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి రాజీనామా చేశా- శిల్పా చ‌క్ర‌పాణి
  • రాజీనామా చేసిన ప‌దవి కోసం మ‌ళ్లీ యుద్ధం చేయాల్సిన అవ‌స‌రం లేదు
కర్నూలు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల బ‌రి నుంచి తాము త‌ప్పుకుంటున్న‌ట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు టీడీపీ త‌మ అభ్య‌ర్థిగా కేఈ ప్ర‌భాక‌ర్ పేరును ప్ర‌క‌టించింది. అప్ప‌ట్లో ఆ ప్రాంతం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న‌ శిల్పా చక్రపాణి రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన నేప‌థ్యంలో త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఈ ఎన్నిక‌లు వచ్చాయి. ఈ స్థానానికి జనవరి 21న ఎన్నిక జరపనున్నట్లు ఇదివరకే ఈసీ ప్రకటన విడుదల చేసింది.

 దీనిపై స్పందించిన శిల్పా చ‌క్ర‌పాణి తాను నైతిక విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి రాజీనామా చేశాన‌ని చెప్పుకొచ్చారు. తాను రాజీనామా చేసిన ప‌దవి కోసం మ‌ళ్లీ యుద్ధం చేయాల్సిన అవ‌స‌రం లేద‌నుకున్నాన‌ని అన్నారు. నేను విసిరేసిన పోస్టును టీడీపీ నేత‌లు పోటీప‌డి ఏరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.   
shilpa chakrapani
YSRCP
Telugudesam

More Telugu News