సాయిపల్లవి గురించి అలా రాశారు .. అందులో నిజం లేదు: దిల్ రాజు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సాయిపల్లవి గురించి అలా రాశారు .. అందులో నిజం లేదు: దిల్ రాజు

  • సాయిపల్లవి సమయానికి షూటింగ్ కి వచ్చేసేది 
  • డేట్స్ పరంగా కూడా ఇబ్బంది పెట్టలేదు 
  • 'శ్రీనివాస కల్యాణం' కథ ఆమె విననే లేదు        
దిల్ రాజు నిర్మించిన 'ఫిదా' చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సాయిపల్లవికి విపరీతమైన క్రేజ్ ను తీసుకొచ్చింది. దాంతో దిల్ రాజు తదుపరి చిత్రమైన 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' సినిమాలో సాయిపల్లవికి చోటుదక్కింది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ, సాయిపల్లవి గురించి కొన్ని రోజులుగా జరుగుతోన్న ప్రచారం గురించి ప్రస్తావించారు.

"ఈ సినిమా కోసం ఇచ్చిన కాల్షీట్లను సాయిపల్లవి ఎగ్గొట్టిందనే వార్తల్లో నిజం లేదు. ఆమె బిజీగా ఉండటం వలన కొన్ని డేట్స్ సర్దుబాటు చేయలేకపోయింది. ఆ తరువాత తన కారణంగా షూటింగ్ ఆలస్యం కాకుండా సహకరించింది. ఇక ఆమె సమయానికి షూటింగ్ కి రాకుండా టీమ్ ను ఇబ్బంది పెట్టునట్టుగా కూడా రాశారు .. అందులోను నిజం లేదు. చెప్పిన సమయానికి ఆమె షూటింగ్ కి వచ్చేసేది. ఇక 'శ్రీనివాస కల్యాణం' కథ విని సాయిపల్లవి చేయనందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. అసలామె ఇంతవరకూ ఆ కథనే వినలేదు" అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు.           
Dil Raju
sai pallavi

More Telugu News