బోయపాటితో చరణ్ మూవీ .. విలన్ గా వివేక్ ఒబెరాయ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బోయపాటితో చరణ్ మూవీ .. విలన్ గా వివేక్ ఒబెరాయ్!

  • బోయపాటితో చరణ్ యాక్షన్ ఎంటర్టైనర్  
  • వచ్చేనెల రెండవ వారంలో రెగ్యులర్ షూటింగ్
  • కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్
చరణ్ తన తదుపరి సినిమాను బోయపాటితో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవలే ఈ సినిమాను లాంచ్ చేశారు. జనవరి రెండవ వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. బోయపాటి మార్క్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమాలో చరణ్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా వుండనుందట. విలన్ పాత్రను కూడా బోయపాటి ఆ స్థాయిలోనే మలిచాడని అంటున్నారు. ఈ కారణంగానే విలన్ పాత్ర కోసం వివేక్ ఒబెరాయ్ ను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. దాదాపు ఆయన ఎంపిక ఖరారైపోయిందనేది తాజా సమాచారం. గతంలో ఆయన తెలుగులో 'రక్త చరిత్ర' సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల తమిళంలో వచ్చిన 'వివేగం' కూడా ఆయనకి మంచి పేరును తెచ్చిపెట్టింది.       
charan
boyapati

More Telugu News