ఆకాశయానంలో దశాబ్దాల చరిత కలిగిన 'బోయింగ్' ఇక చరిత్రలోకి!
- ఐదు దశాబ్దాల సేవలకు రేపటితో చెక్
- బోయింగ్ 747లో 600 మంది ప్రయాణించే వీలు
- 1969లో తొలిసారి అందుబాటులోకి బోయింగ్ సేవలు
మంగళవారంతో విమానయానానికి బోయింగ్ 747 స్వస్తి చెప్పనుండడంతో చివరిసారిగా ఈ విమానంలో ప్రయాణించాలని ఔత్సాహికులు ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో టికెట్ల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించే మోడళ్లవైపు దృష్టి పెట్టిన కారణంగా ఈ విమానానికి వీడ్కోలు పలుకుతున్నారు. కాగా, బోయింగ్‌కు అమెరికా మాత్రమే విశ్రాంతి ఇస్తుండగా ప్రముఖ విమానయాన సంస్థలైన లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్వేస్, కొరియన్ ఎయిర్‌వేస్‌లు వీటిని ఇంకా కొనసాగిస్తున్నాయి.