సల్మాన్ ఖాన్ 'టైగ‌ర్ జిందా హై'కి అనుమ‌తి ఇవ్వ‌ని పాకిస్థాన్ సీబీఎఫ్‌సీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సల్మాన్ ఖాన్ 'టైగ‌ర్ జిందా హై'కి అనుమ‌తి ఇవ్వ‌ని పాకిస్థాన్ సీబీఎఫ్‌సీ

  • త‌మ దేశఖ్యాతిని దెబ్బ‌తీసేలా ఉన్న క‌థ‌
  • నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్ జారీకి తిరస్కరణ ‌
  • డిసెంబ‌ర్ 22న‌ విడుద‌ల‌కు సిద్ధ‌మైన చిత్రం
'ఏక్ థా టైగ‌ర్' చిత్రానికి కొన‌సాగింపుగా వ‌స్తున్న స‌ల్మాన్ ఖాన్ 'టైగ‌ర్ జిందా హై' చిత్రానికి పాకిస్థాన్ సీబీఎఫ్‌సీ అనుమ‌తి ఇవ్వ‌లేదు. త‌మ దేశ ఖ్యాతిని దెబ్బ‌తీసేలా ఉన్న క‌థాంశంతో చిత్రాన్ని తెర‌కెక్కించిన నేప‌థ్యంలో సినిమా విడుద‌ల‌కు నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్ జారీ చేయ‌డానికి పాకిస్థాన్ ప్ర‌సార మంత్రిత్వ శాఖ నిరాక‌రించింది. అలీ అబ్బాస్ జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో స‌ల్మాన్ ఖాన్ భార‌త ఏజెంట్‌గా, క‌త్రినా కైఫ్ పాకిస్థానీ గూఢ‌చారిగా నటించారు.

డిసెంబ‌ర్ 22న విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న ఈ చిత్ర ట్రైల‌ర్‌, రెండు పాటలు అభిమానుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు, క‌త్రినా, స‌ల్మాన్‌ల కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్‌గా నిల‌వ‌నున్నాయి.
Salman Khan
katrina kaif
tiger zinda hai

More Telugu News