సైన్స్ ఫిక్షన్ కథాంశంతో మెగా హీరో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సైన్స్ ఫిక్షన్ కథాంశంతో మెగా హీరో!

  • మరో సినిమాకి సంకల్ప్ రెడ్డి సన్నాహాలు
  • హీరోగా వరుణ్ తేజ్ 
  • ఫిబ్రవరి తరువాత సెట్స్ పైకి    
వరుణ్ తేజ్ కథానాయకుడిగా 'తొలిప్రేమ' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో టాలెంటెడ్ దర్శకుడికి వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆయన ఎవరో కాదు .. 'ఘాజీ' దర్శకుడు 'సంకల్ప్ రెడ్డి. 'ఘాజీ' సినిమాతో సంకల్ప్ రెడ్డి సామర్థ్యం ఏమిటనేది అందరికీ అర్థమైపోయింది. దాంతో ఆయనతో సినిమాలు చేయడానికి యువ హీరోలంతా ఆసక్తిని చూపుతున్నారు.

 ఈ నేపథ్యంలో సంకల్ప్ రెడ్డి తన నెక్స్ట్ మూవీ హీరోగా వరుణ్ తేజ్ ను ఎంచుకున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ రెడీ అయిందట. త్వరలోనే పూర్తి వివరాలతో ప్రకటన చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం వరుణ్ తేజ్ చేస్తోన్న 'తొలిప్రేమ' ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఆ తరువాత కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కనుందని అంటున్నారు. 
varun tej
sankalp reddy

More Telugu News