విరాట్ - అనుష్కలను ఇటలీలో పెళ్లి చేసుకోమని చెప్పిందెవరో తెలుసా?
- యశ్‌రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా
- మీడియా హడావుడిని తప్పించుకోవడానికి ఇటలీ బెటరని సలహా
- అనుష్కను బాలీవుడ్‌కి పరిచయం చేసింది ఆయనే
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు తమ పెళ్లి వేదికగా ఇటలీనే ఎంచుకోవడం వెనక ఓ వ్యక్తి ఉన్నారు. ఆయనే యశ్‌రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా. అవును... భారత్‌లో ఎక్కడ పెళ్లి చేసుకున్నా మీడియాకు తెలిసిపోయి హడావుడి సృష్టిస్తారని, ప్రశాంతంగా పెళ్లి జరగాలంటే ఇటలీలో చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చారట. ఆయన రాణీ ముఖర్జీని 2014లో ఇటలీలోనే పెళ్లాడారు.
ఆయన దర్శకత్వం వహించిన ‘రబ్ నే బనాది జోడీ’ చిత్రంతోనే అనుష్క బాలీవుడ్‌కు పరిచయమైంది. తర్వాత ‘యశ్‌రాజ్ ఫిలింస్’ నిర్మించిన మూడు సినిమాల ద్వారా అనుష్క శర్మ అగ్రకథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.