కత్రినా కైఫ్‌లా కనిపిస్తున్న 'దంగల్' హీరోయిన్.... నెటిజన్ల కామెంట్లు!
- ఫొటోలు పోస్ట్ చేసిన ఫాతిమా సనా షేక్
- కరీనా, కత్రినాలతో పోల్చిన నెటిజన్లు
- 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్'లో నటిస్తున్న ఫాతిమా
చీరకట్టులో సంప్రదాయం ఉట్టిపడేలా ఉన్న కొన్ని ఫొటోలను ఫాతిమా పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో ఆమె అచ్చం కత్రినా కైఫ్లాగే కనిపిస్తోంది. ఇంకో ఫొటోలో అయితే కరీనా కపూర్, కత్రినాలు కలబోసినట్లుగా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు విసిరారు. ప్రస్తుతం ఈ భామ 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' సినిమాలో నటిస్తోంది.