ఆ సినిమా నుంచి వైదొలగే హక్కు నాకు ఉంది: త్రిష
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ సినిమా నుంచి వైదొలగే హక్కు నాకు ఉంది: త్రిష

  • 'సామి 2' సినిమాలో విక్రమ్ కు జంటగా త్రిష, కీర్తి సురేష్
  • సినిమా నుంచి వైదొలగిన త్రిష
  • తనకు ప్రాధాన్యత లేదని ఆరోపణ
తెలుగు, తమిళ భాషల్లో అగ్రనటిగా కొనసాగుతున్న త్రిష... ఎప్పుడూ ఏదో వివాదంలో ఉంటూ, పతాక శీర్షికల్లో ఉంటుంది. గతంలో విక్రమ్ సరసన 'సామి' చిత్రంలో త్రిష నటించింది. ఆ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో... ఇప్పుడు దానికి సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో విక్రమ్ కు జంటగా త్రిష, కీర్తి సురేష్ లను ఎంపిక చేశారు. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే సమయంలో... సినిమా నుంచి త్రిష తప్పుకుంది. దీంతో ఆ సినిమా నిర్మాత షాక్ కు గురయ్యారు. నిర్మాతల మండలిలో త్రిషపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో త్రిషకు నిర్మాతల మండలి నోటీసులు జారీ చేసింది.

ఈ వ్యవహారంపై త్రిష స్పందించింది. సినిమాలో కీర్తి సురేష్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉందని... ఆమె కంటే తనకు తక్కువ సన్నివేశాలు ఉన్నాయని తెలిపింది. తాను ఇంతవరకు 'సామి 2' సినిమాలో ఒక్క సన్నివేశంలో కూడా నటించలేదని... అందువల్ల సినిమా నుంచి వైదొలగే హక్కు తనకు ఉందని చెప్పింది. తాను తీసుకున్న అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చేస్తానని తెలిపింది. మరోవైపు, ఈ సినిమాలో ఆమెను నటింపజేసేందుకు ఇంకా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయట. 
trisha
kollywood
tollywood
saami 2

More Telugu News