షాకింగ్... దేశ రాజధానిలో మహిళా న్యాయమూర్తినే కిడ్నాప్ చేయబోయిన క్యాబ్ డ్రైవర్
- కర్ కర్ దుమా కోర్టుకి వెళ్లేందుకు క్యాబ్ బుకింగ్
- కోర్టుకు కాకుండా హపూర్ వైపు క్యాబ్ మళ్లించిన డ్రైవర్
- సహచరులు, పోలీసులకు సమాచారమిచ్చి అప్రమత్తత
దీంతో ఆమె వెంటనే అప్రమత్తమై తన సహచరులు, పోలీసులకు సమాచారం అందించారు. కొంత దూరం వెళ్లిన తరువాత క్యాబ్ డ్రైవర్ యూటర్న్ తీసుకుని ఢిల్లీ దిశగా క్యాబ్ ను పోనిచ్చాడు. దీంతో కారును వెంబడించిన పోలీసులు ఘాజిపుర్ టోల్ ప్లాజా వద్ద కారును ఆపి అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో అత్యాచారాలు, కిడ్నాపులు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏకంగా మహిళా న్యాయమూర్తిని కిడ్నాప్ చేసే ప్రయత్నం జరగడం ఢిల్లీలో మహిళా రక్షణపై తీవ్ర ఆందోళన రేపుతోంది.