14 ఏళ్ల తరువాత దిల్ రాజుతో నితిన్ 'శ్రీనివాస కల్యాణం'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

14 ఏళ్ల తరువాత దిల్ రాజుతో నితిన్ 'శ్రీనివాస కల్యాణం'

  • గతంలో నితిన్ 'దిల్' తో హిట్ కొట్టిన రాజు 
  • దిల్ రాజుకి రీసెంట్ గా హిట్ ఇచ్చిన సతీశ్ వేగేశ్న 
  • ఈ ముగ్గురి కాంబినేషన్లో 'శ్రీనివాస కల్యాణం'
  • వచ్చే ఏడాది మార్చిలో సెట్స్ పైకి        
14 సంవత్సరాల క్రితం నితిన్ హీరోగా వచ్చిన 'దిల్' .. ప్రేమకథా చిత్రాల్లో కొత్త ట్రెండ్ ను సృష్టించింది. ఈ సినిమాతో నిర్మాత రాజు ఇంటి పేరుగా 'దిల్' మారిపోయింది. ఇక నితిన్ ను కూడా ఈ సినిమా హీరోగా నిలబెట్టేసింది. అలాంటి ఈ కాంబినేషన్లో మళ్లీ ఇంతకాలానికి ఓ సినిమా రూపొందడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇటీవల 'శతమానం భవతి' సినిమాతో హిట్ అందుకున్న దిల్ రాజు, ఈ సినిమా దర్శకుడు సతీశ్ వేగేశ్నతో మరో సినిమాను చేయడానికి రంగంలోకి దిగారు. ఈ సినిమాకి 'శ్రీనివాస కల్యాణం' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. నితిన్ హీరోగా వచ్చే ఏడాది మార్చిలో ఇది సెట్స్ పైకి వెళ్లనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. సంగీత దర్శకుడిగా మిక్కీ జె.మేయర్ ను ఎంపిక చేసుకున్నారు. కథానాయికతో పాటు ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేస్తారు. తనకి హిట్ ఇచ్చిన హీరోతోను .. దర్శకుడితోను కలిసి దిల్ రాజు చేస్తోన్న ఈ సినిమా, సంచలనానికి తెరదీస్తుందేమో చూడాలి.             
nithin
gil raju
sathish vegeshna

More Telugu News