25వ సినిమాపై మరింత శ్రద్ధ పెట్టిన మహేశ్ బాబు .. ఆలస్యంగా సెట్స్ పైకి?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

25వ సినిమాపై మరింత శ్రద్ధ పెట్టిన మహేశ్ బాబు .. ఆలస్యంగా సెట్స్ పైకి?

  • షూటింగ్ దశలో 'భరత్ అనే నేను' 
  • మహేశ్ 25వ సినిమా వంశీ పైడిపల్లితో
  • 'స్పైడర్' ఎఫెక్ట్ కి జాగ్రత్త పడుతోన్న మహేశ్ 
  • జనవరిలో సెట్స్ పైకి వెళ్లడం డౌటే  
ప్రస్తుతం మహేశ్ బాబు 24వ సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ చాలా వరకూ పూర్తయింది. ఈ సినిమా షూటింగ్ కొనసాగుతూ ఉండగానే .. జనవరిలో తన 25వ సినిమాను ప్రారంభించాలని మహేశ్ భావించాడు. దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఆ దిశగానే సన్నాహాలు చేస్తున్నాడు.

అయితే 'స్పైడర్' ఎఫెక్ట్ కారణంగా 'భరత్ అనే నేను' ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టిన మహేశ్ బాబు .. తన 25వ సినిమాపై కూడా ప్రత్యేక శ్రద్ధపెట్టినట్టుగా సమాచారం. ఈ కారణంగానే హడావిడిగా ఈ సినిమాను మొదలుపెట్టకుండా, 'భరత్ అనే నేను' విడుదలైన తరువాతనే 25వ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నట్టు చెబుతున్నారు. మహేశ్ కెరియర్ లోను .. అభిమానుల దృష్టిలోను సంఖ్యా పరంగా 25వ సినిమాకి ప్రత్యేకత ఉంటుంది కనుకనే మహేశ్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది.  
Mahesh Babu
vamsi paidipalli

More Telugu News