అందమైన మనసు.. అవయవదానానికి ముందుకొచ్చిన రకుల్ ప్రీత్!
- మరణానంతరం అవయవదానానికి అంగీకారం
- మ్యాక్స్ క్యూర్ ఆర్గాన్ డొనేషన్ పత్రంపై సంతకం
- 26న 10కే రన్ లో పాల్గొనాలని పిలుపు
ఈ సందర్భంగా ‘నేను సైతం’ అంటూ మరణానంతరం అవయవదానం చేయడానికి అంగీకరిస్తూ ఆర్గాన్ డొనేషన్ ప్లెడ్జ్ పత్రంపై సంతకం చేసింది. ఈ నెల 26న అవయవదానంపై అవగాహన కోసం నిర్వహిస్తున్న 10కే రన్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. సినీ నటి సమంత సైతం అవయవదానానికి గతంలో అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే.