తారల ఆటపాటలు: ఎనిమిదో గెట్ టుగెద‌ర్ వేడుక చేసుకున్న 80's ద‌క్షిణాది తార‌లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తారల ఆటపాటలు: ఎనిమిదో గెట్ టుగెద‌ర్ వేడుక చేసుకున్న 80's ద‌క్షిణాది తార‌లు!

  • ఒకే రంగు దుస్తుల్లో ఎంజాయ్ చేసిన న‌టీనటులు
  • ర్యాంప్ వాక్‌లు, ఆట‌లు, పాట‌లతో స‌ర‌దాగా గ‌డిపిన తార‌లు
  • గ్రూప్ ఫొటో పోస్ట్ చేసిన న‌టి రాధిక‌
ప్ర‌తి సంవ‌త్స‌రం లాగే ఈసారి కూడా 1980ల కాలంలో దక్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విశేష ప్రేక్షకాదరణ పొందిన సినీ తారలంద‌రూ ఒక‌చోట గెట్ టుగెద‌ర్ ఏర్పాటు చేసుకుని ఎంజాయ్ చేశారు. `80's సౌత్‌ యాక్టర్స్‌ రీ-యూనియన్‌’ పేరుతో జ‌రుపుకునే ఈ వేడుక న‌వంబ‌ర్ 17న‌ చెన్నై సమీపంలోని మ‌హాబ‌లిపురంలో జ‌రిగింది. అంద‌రూ ఒకే రంగు దుస్తులు ధ‌రించి, ఆనందంగా ఫొటోల‌కు పోజులిచ్చారు.

ఈ సారి వంగ‌పువ్వు రంగును తమ థీమ్‌గా ఎంచుకున్నారు. ఈ వేడుక‌లో ఆట‌లు, పాట‌ల‌తో పాటు ర్యాంప్ వాక్‌లు కూడా నిర్వ‌హించుకున్నార‌ట‌. అయితే ఆ పోటీల్లో చిరంజీవి బృందం గెలిచిన‌ట్లు తెలుస్తోంది. ఈ వేడుక‌కు సంబంధించిన ఓ గ్రూప్ ఫొటోను న‌టి రాధిక త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పంచుకుంది. `ఎ ల‌వ్లీ వీకెండ్ విత్ ద 80's ఫ్రెండ్స్ ఫ‌ర్ లైఫ్‌` అంటూ ఆమె పోస్ట్ చేసింది. రెండు రోజుల పాటు జ‌రిగిన ఈ పార్టీలో చిరంజీవి, వెంకటేశ్‌, సురేశ్‌, భానుచందర్‌, శరత్‌కుమార్‌, నరేష్‌, రెహమాన్‌, జయసుధ, రాధిక, శోభన, సుహాసిని, ఖుష్బూ, రమ్యకృష్ణ, సుమలత, నదియ, రాధ, లిజీ, రేవతి తదితరులు పాల్గొన్నారు.
get together
south stars
chiranjeevi
radhika
venkatesh
revathi

More Telugu News