దీపికా పదుకునే విషయంలో జరుగుతోన్న పరిణామాలను తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యా: హాలీవుడ్ నటి
- ప‌ద్మావ‌తి సినిమాలో న‌టించిన దీపికా ప‌దుకునేని చంపేయాల‌ని హెచ్చ‌రిక‌లు
- స్పందించిన హాలీవుడ్ న‌టి రూబీ రోస్
- దీపిక చేస్తోన్న‌ పోరాటానికి హాట్సాఫ్
- నాకు తెలిసిన ధైర్యవంతమైన మహిళలలో దీపిక ఒక‌రు
దీపికా పదుకునే నటించిన బాలీవుడ్ సినిమా పద్మావతిని వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీపికా పదుకునేని చంపేయాలని, ఆమె ముక్కుకోయాలని రాజ్పుత్ కర్ణిసేన వ్యాఖ్యలు చేస్తోంది. ఈ వివాదం గురించి తెలుసుకుని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని హాలీవుడ్ నటి రూబీ రోస్ ట్వీట్ చేసింది. ఆమధ్య దీపికా పదుకునే నటించిన హాలీవుడ్ చిత్రం 'ట్రిపుల్ ఎక్స్: రిటర్న్స్ ఆఫ్ క్జాండర్ కేజ్'లో రూబీ రోస్ కూడా నటించారు. తన స్నేహితురాలి విషయంలో జరుగుతున్న పరిణామాల గురించి తెలుసుకున్నానని, ఆమె చేస్తోన్న పోరాటానికి హాట్సాఫ్ అని రూబీ పేర్కొంది. తనకు తెలిసిన ధైర్యవంతమైన మహిళలలో దీపిక ఒకరని మద్దతు తెలిపింది.