నేను చాలా గౌర‌వించే మ‌హిళ‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు... నయనతారపై ట్వీట్ చేసిన దర్శకుడు విఘ్నేశ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను చాలా గౌర‌వించే మ‌హిళ‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు... నయనతారపై ట్వీట్ చేసిన దర్శకుడు విఘ్నేశ్!

  • ఇవాళ న‌య‌న‌తార పుట్టిన‌రోజు
  • వీళ్లిద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు గ‌తంలో వార్తలు
  • అనుమానాలు నిజం చేసిన ద‌ర్శ‌కుడి ట్వీట్‌
అద్భుత‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మైమ‌రిచిపోయేలా చేసే నటి న‌య‌న‌తార పుట్టిన‌రోజు ఇవాళ‌. నేటితో ఆమెకు 32 ఏళ్లు నిండాయి. ఈ సంద‌ర్భంగా సినీ ప్ర‌ముఖులు ఆమెకు సోష‌ల్ మీడియాలో విషెస్ తెలిపారు. వారందరిలోనూ న‌య‌న‌తార‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ త‌మిళ‌ ద‌ర్శ‌కుడు విఘ్నేశ్ శివ‌న్ చేసిన ట్వీట్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. గ‌త కొద్దికాలంగా వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే వారిద్ద‌రూ పెళ్లి కూడా చేసుకోబోతున్న‌ట్లు వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఇలాంటి స‌మ‌యంలో విఘ్నేశ్ శివ‌న్ చేసిన ట్వీట్ అంద‌రి అనుమానాల‌ను నిజం చేస్తోంది.

'నేను ఎంతో గౌర‌వించే మ‌హిళ‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. ఇలాగే ధైర్యంగా, అందంగా ఉండు. నయ‌న‌తార అంటే ఏంటో చూపిస్తూ ఉండు. నిన్ను చూస్తే ఎప్పుడూ గ‌ర్వంగానే ఉంటుంది. నా ప్రేమ‌, గౌర‌వం నీకే నా తంగ‌మ్మే' అని విఘ్నేశ్ ట్వీట్ చేశాడు. వాళ్లిద్ద‌రూ క‌లిసి ఉన్న ఫొటోను కూడా విఘ్నేశ్ షేర్ చేశాడు. ఇటీవ‌ల న‌య‌న‌తార న‌టించిన 'ఆరమ్‌' సినిమా మంచి విజ‌యం సాధించిన సంగతి తెలిసిందే.
nayantara
vignesh shivan
tamil
aramm
hit
thangammey

More Telugu News